Spread the love

మణిపూర్ బాధ్యులను కఠినంగా శిక్షించాలి..

ఏజెన్సీ న్యూస్ , ఇల్లందు ప్రతినిది 22 జూలై 2023 , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు లోని BSSM కార్యాలయంలో  BSSM  మహిళా రాష్ట్ర కమిటీ మాట్లాడుతూ భారత దేశానికి గిరిజన రాష్ట్రపతి ఉండంగా ఇంత కిరాచకంగా మణిపూర్ రాష్ట్రంలో కుకి గిరిజన తెగకు చెందిన ఇద్దరు మహిళలను గిరిజనేతర వర్గాలకు చెందిన నేతలు బట్టలు తీసి ఊరేగింపుగా తీసుకొచ్చి మానభంగం చేయడం యావత్ భారత మహిళా లోకానికి మచ్చ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన మన భారతదేశంలో అణగారిన వర్గాలైన గిరిజన తెగలకు చెందిన మహిళలను పురుషులను ఈ దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక మూలన గిరిజన తెగలపై మానభంగాలు,హత్యలు, దాడులు, అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. మణిపూర్ రాష్ట్రంలో గత కొంతకాలం నుండి గిరిజనేతరులకు మరియు కుకి గిరిజన తెగల మధ్య యుద్ధం, రాష్ట్రం రావణ కాస్టంలా మారుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పటిష్ట చర్యలు తీసుకోకపోవడం మూలంగా గిరిజన మహిళలను వివస్త్రను చేసి ఊరేగింపుగా తీసుకొచ్చి నీచాన నీచంగా మానభంగం చేసిన దుండగులపై సుమోటోగా కేసును సుప్రీంకోర్టు స్వీకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలులో ఒక గిరిజన యువకుడిని రౌడీ మూకలు అత్యంత పాసవికంగా దాడి చేసి మృగంలా వ్యవహరించి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే ఆ యువకుడు పై దుండగులు మూత్రం పోసిన సంఘటనలు జరిగాయి ఇలాంటి సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోకపోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా గిరిజన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకొని బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *