Spread the love

పినపాక నియోజకవర్గంలో మొదటి నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు..

ఏజెన్సీ న్యూస్ , మణుగూరు ప్రతినిది 04 నవంబర్ 2023,  పినపాక నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే తొలి నామినేషన్ దాఖలు చేశారు. మణుగూరు లోని తహశీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు.. ఈ కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమలు లో ఉంటుందని ప్రజలు గమనించి సహకరించాలని పోలీసులు తెలిపారు. ఈ నెల 30 న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 3 నుండీ నామినేషన్ పక్రియ మొదలైంది. కానీ నిన్న ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.. ఈ రోజు తొలి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ . ఈ నెల 30 న జరగనున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్టం లో కాంగ్రెస్ పార్టీ గెలవనుంది.. పినపాక నియోజకవర్గం లో కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నికల వరకు ప్రజలతో మమేకమై కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టిన 6 పథకాలు గురుంచి ప్రజలకు అవగాహన కల్పించాలని . నియోజకవర్గం లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ పారీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు..

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *