బిఎస్పి నాయకులు కార్యకర్తలారా సిద్ధంగా ఉండండి….
ఏజెన్సీ న్యూస్ , మణుగూరు ప్రతినిది 28 జూలై 2023, గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఏజెన్సీ వాసులు, వాగులు వంకలు పొంగి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా చోట్ల ఇండ్లు మునిగిపోయి పునరావాస కేంద్రాల్లో సేద తీరుతున్నారు. పినపాక నియోజకవర్గంలో బిఎస్పి కార్యకర్తలు బాధితులకు సహాయం చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని పినపాక నియోజకవర్గం బీఎస్పీ పార్టీ ఇంచార్జ్ అలెం కోటి ఒక ప్రకటనలో తెలిపారు. ఎగువ ప్రాంతంలో పెరుగుతున్న వరదల వలన పినపాక నియోజకవర్గం లో గోదావరి పరివాహక ప్రాంతంలో కమలాపురం రాయీగూడెం అన్నారం రామచంద్రాపురం నుంచి భద్రాచలం వెళ్లే రహదారుల ముంపుకు గురయ్యాయని ముంపు ప్రాంత ప్రజలంతా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని రాబోయేది బిఎస్పి ప్రభుత్వమే అని, బీఎస్పీ ప్రభుత్వంలో శాశ్వత పరిష్కారం చూపెడతామని పినపాక నియోజకవర్గం ఇంచార్జీ అలెం కోటి తెలిపారు..