Spread the love

గుండాల,కోమరారం,ఇల్లందు పోలీస్ స్టేషన్లను సందర్శించిన మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్

ఏజెన్సీ న్యూస్ , కొత్తగూడెం ప్రతినిది 28 జూలై 2023 ,ఈ రోజు మల్టీ జోన్ -1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారు జిల్లా ఎస్పీ డా.వినీత్.జి గారితో కలిసి గుండాల,కోమరారం,ఇల్లందు పోలీస్ స్టేషన్ల ను సందర్శించారు.మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల గురించి పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు.వరద ముంపు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలని సూచించారు.అన్ని శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ వరద ముంపుకు గురైన బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని తెలియజేశారు.గుండాల మండలం ముత్తాపురంలో వరదల్లో చిక్కుకున్న 12 మందిని కాపాడిన 05గురు ఈతగాళ్లను ఐజీ గారు ఈ సందర్భంగా అభినందించారు.వారికి నగదు రివార్డులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పి రమణమూర్తి,ఇల్లందు సిఐ కరుణాకర్,గుండాల సిఐ రవీందర్,గుండాల ఎస్సై రాజశేఖర్,కొమరారం ఎస్సై గిరిధర్ రెడ్డి మరియ సిబ్బంది పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *