బాధితులకు ధైర్యం చెప్పి… మేమున్నామంటూ భరోసా…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
ఏజెన్సీ న్యూస్ , బూర్గంపాడు ప్రతినిది 28 జూలై 2023 , బూర్గంపాడు మండలం లోని గోదావరి ముంపు ప్రాంతాలలోని పలు గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు విస్తృతంగ పర్యటించారు, అదేవిధంగా కస్తూరి గాంధీ బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని మరియు సారపాక గ్రామపంచాయతీలోని బిపిఎల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావస కేంద్రాలను సందర్శించడం జరిగింది , ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజలకు అండగా నిలబడుతున్నామన్నారు మెడికల్ క్యాంపులు వసతులు పరిశీలించారు ప్రాంతాలలోని వరద బాధితులకు అండగా నిలుస్తూ వారికి ధైర్యం కల్పించారు, వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు బాధితులకు భోజనం వసతులతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు, అవసరమైన వారికి వైద్య పరీక్షలు చేపడుతున్నామని అన్నారు, వరద బాధితులకు పార్టీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటున్నామని అన్నారు,ఈ పకృతి విలయానికి తల్లాడిన ప్రాంతాలలో ముమ్మరంగా చర్యలు చేపడుతున్నామన్నారు రేస్క్యూ టీంలు గజఈ తగాళ్ళు పడవలను అందుబాటులో ఉంచామని సహకారాలలో అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు అలాగే ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో పనిచేస్తున్నారు,