మణిపూర్ ఘటనకు బిజెపి డబుల్ ఇంజన్ సర్కారు బాధ్యత వహించాలి. మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర యువసేన అధ్యక్షుడు గొల్లపల్లి నరేష్ కుమార్ డిమాండ్……
ఏజెన్సీ న్యూస్, అశ్వాపురం ప్రతినిది,22 జూలై 2023 , అశ్వాపురం మండలం ఎస్సీ కాలనీలో జరిగిన మాదిగ హక్కుల దండోరా ముఖ్య కార్యకర్తల సమావేశం అశ్వాపురం మండల అధ్యక్షుడు చుంచు ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర యువసేన అధ్యక్షుడు గొల్లపల్లి నరేష్ కుమార్ గొల్లపల్లి నరేష్ కుమార్ మాట్లాడుతూ మణిపూర్ లో గత 80 రోజుల నుండి ఆదివాసి గిరిజనులపై జరుగుతున్న హింసకాండ కు బిజెపి డబుల్ ఇంజన్ సర్కారు పూర్తి బాధ్యత వహించి ఆదివాసి గిరిజన మహిళలను నగ్నంగా మైతీ తెగకు చెందిన వాళ్లు కుకి ఆదివాసి గిరిజనులపై విచక్షణ రహితంగా చంపుతూ వారిపై దాడులను చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి దారుణమైన సంఘటనలు జరుగుతున్న అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసి గిరిజనుల పై దాడులు చేస్తూ విచక్షణ రహితంగా చంపుతూ మహిళలను నగ్నంగా తిప్పుతూ ఇండ్లను కూల్చివేస్తూ మంటలు పెడుతూ వివిధ రకాలుగా వాళ్లపై విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నటువంటి అల్లరి ముకలను అదుపు చేయడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. అక్కడి ఆదివాసి గిరిజన ప్రజలకు భద్రత కల్పించి ఆ రాష్ట్ర ప్రభుత్వం సంఘటనపై పూర్తి విచారణ జరిపించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని వారికి రక్షణ కల్పించవలసిన బాధ్యత బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్ పై ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో మాదిగ హక్కుల దండోరా( ఎంహెచ్డీ) పినపాక నియోజకవర్గం అధ్యక్షుడు జెర్రిపోతుల శీను, పినపాక నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సాయిబాబా,పినపాక నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాంబాబు,పినపాక నియోజకవర్గ ప్రచార కార్యదర్శి కంచర్ల రవి, పినపాక నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జి ఈనపెళ్లి పవన్ సాయి,అశ్వాపురం మండల గౌరవ అధ్యక్షులు కొమ్ము వెంకన్న,అశ్వాపురం మండల యూత్ అధ్యక్షుడు చుంచు ప్రదీప్,అమేర్ధ పంచాయతీ అధ్యక్షుడు బాబురావు, పినపాక మండల ఉపాధ్యక్షుడు దర్శనాల రమేష్,మణుగూరు మండల అధ్యక్షుడు గొడ్ల కొండలు,మణుగూరు మండల ప్రధాన కార్యదర్శి కొప్పుల సాంబశివరావు,బూర్గంపాడు మండల అధ్యక్షుడు కొప్పుల ఆదిత్య,బూర్గంపాడు యూత్ అధ్యక్షుడు నవీన్ తదితరులు పాల్గొన్నారు