కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి మాదిగ మేధావులు ఉన్నత ఉద్యోగుల ప్రత్యేక సమావేశం.
ఏజెన్సీ న్యూస్ , హైదరాబాద్ ప్రతినిది 26 జూలై 2023 , నాంపల్లిలో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో గౌ శ్రీ మంద కృష్ణ మాదిగ గారి నేతృత్వంలో కేంద్ర మంత్రి వర్యులు జి కిషన్ రెడ్డి గారితో మాదిగ మేదావులు, ఉన్నత ఉద్యోగులు, డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, ప్రొఫెసర్స్, జర్నలిస్టులు ప్రత్యేక సమావేశం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత పక్రియను త్వరగా జరిగేలా చూడాలని,ప్రధానమంత్రి గారితో ఢిల్లీలో మంద కృష్ణ మాదిగ గారిని కలిపించి పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టేలా చూడాలని కోరడం జరిగింది. ఈ సమావేశాన్ని డా. బాబు రావు మాదిగ గారు అధ్యక్షత వహించారు.