Spread the love

అశ్వాపురం, మణుగూరు గోదావరి పరివాహక ప్రాంతాలల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల

  ఏజెన్సీ న్యూస్ , మణుగూరు  ప్రతినిది 22 జూలై 2023, గోదావరికి వరద ఉధృతి కోసాగుతున్న నేపథ్యంలో జాలర్లు చేపల వేటకు వెళ్లకుండా నియంత్రణ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తహసీల్దార్లను, ఎంపిడిఓలను ఆదేశించారు. శనివారం బూర్గంపాడు నుండి ఇరవెండి మీదుగా అశ్వాపురం, మణుగూరు గోదావరి పరివాహక ప్రాంతాలల్లో పర్యటించారు. అనంతరం మణుగూరు మండలం కొండాయిగూడెం లో గోదావరి వరద ఉదృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరికి వరద ఉధృతి కొనసాగుతున్నందున పదవుల్లో ప్రయాణం చేయడం, జాలర్లు చేపల వేటకు వెళ్లడం నిషేధించినట్లు చెప్పారు. రెవిన్యూ, పంచాయతి రాజ్, పోలీస్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత సంవత్సరం ఈ సీజన్ లో గోదావరి 72.3 అడుగులు వచ్చిన సందర్భంలో ముంపునకు గురైన గ్రామాలు, అలాగే రాకపోకలు నియంత్రణకు నీట మునిగిన రహదారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. వరదలు, వర్షాల వల్ల మురుగుకాల్వల్లో నీటి నిలువ లేకుండా పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి డ్రైనేజీలను పరిశుభ్రం చేయాలని పంచాయతి అధికారులను ఆదేశించారు. మురుగునీటి నిల్వ లేకుండా నీరు సాఫీగా పారేందుకు చర్యలు చేపట్టాలని పంచాయతీ మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మురుగుకాలల్లో వ్యర్ధాలు పేరుకుపోవడం వల్ల నీటి నిల్వలతో దోమల వ్యాప్తి జరుగుతుందని తద్వారా అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నట్లు చెప్పారు. దోమల వ్యాప్తి నియంత్రణకు మురుగునీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి ఆయిల్ బాల్స్, గంభూషియా చేపలు వేయడంతో పాటు ఫాగింగ్ చేయాలని చెప్పారు. మురుగునీరు నిల్వలు లేకుండా ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ముక్యంగా పూలకుండీలు, వినియోగించని వాహన టైర్లు లో చేరిన నీటి నిల్వలు, అలాగే పూల మొక్కల పాదుల్లో నీరు నిలిచి ఉండటం వల్ల దోమల వ్యాప్తి జరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు వారంలో రెండు రోజులు అనగా మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమాలు నిర్వహించి పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబల కుండా కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తినొద్దని, వర్షంలో తడవ కుండా రక్షణ చర్యలు పాటించాలని చెప్పారు. జ్వరం వస్తే జాప్యం చేయక తక్షణమే వైద్య సేవలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు, తహసీల్దార్, ఎంపిడిఓ తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *