మణిపూర్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి- DYFI డిమాండ్-దేశవ్యాప్తంగా నిరసన కార్యాచరణకై పిలుపు
ఏజెన్సీ న్యూస్,మణుగూరు ప్రతినిది,21 జూలై 2023, మణిపూర్ ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని DYFI ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు సత్ర పల్లి సాంబశివరావు డిమాండ్ చేసింది. మణిపూర్‌లో జరిగిన సంఘటనలను నిరసిస్తూ, మణిపూర్ మహిళా బాధితులకు, ప్రజలకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిరసన , ముఖ్యమంత్రి రాజీనామాకై డిమాండ్ చేయాలని ఈ మేరకు ఒక ప్రకటన చేసింది.మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రలను చేసి, ఊరేగించిన ఘటనతో దేశం యావత్తు రగిలిపోయింది. పైగా వారిలో ఒక మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు, ఆమెను కాపాడేందుకు వెళ్లిన ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరిని హత్య చేశారు. సంఘటన జరిగిన రెండు వారాల్లోపే బాధిత కుటుంబాలు అత్యంత ధైర్యసాహసాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే ఈ ఘాతుకానికి పాల్పడిన నేరస్తులకు రక్షణ కల్పించడానికి మణిపూర్‌లోని బిజెపి ప్రభుత్వం ప్రత్యక్షంగా సాయపడుతోందని పొలిట్‌బ్యూరో విమర్శించింది. రెండున్నర మాసాలుగా రాష్ట్రం మండుతోంది. అయినా ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం, బిజెపి అగ్ర నాయకత్వం సమర్ధిస్తూ వస్తోంది. నెలల తరబడి మౌనం పాటిస్తూ వచ్చిన ప్రధాని చిట్టచివరకు చేసిన ప్రకటన జరిగిన సంఘటనను, మణిపూర్‌లో సుదీర్ఘంగా చెలరేగుతున్న హింసాకాండను, పైగా ముఖ్యమంత్రి పక్షపాత పాత్రను చాలా చిన్నది చేసేలా ఉందని పొలిట్‌బ్యూరో విమర్శించింది. డబుల్ ఇంజన్ ప్రభుత్వం జవాబుదారీతనం అనే సూత్రాన్ని తుదికంటా సమాధి చేసిందని ఆ ప్రకటన విమర్శించింది. బిజెపి చేస్తున్న సుపరిపాలన వాదనపై ఇది అత్యంత గ్రాఫిక్ వ్యాఖ్యానమని పేర్కొంది.