తెలంగాణ ఐటీకి బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ తండ్రికి తగిన తనయునిగా ప్రజాసేవ చేస్తున్న యువ నాయకుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…
ఏజెన్సీ న్యూస్ , మణుగూరు ప్రతినిది 24 జూలై 2023 ,వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ భాగంగా సుమారు 2 వేల గొడుగులను పంపిణీ చేసిన… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & ఐటి పురపాలక శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా, గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సోమవారం నాడు నియోజకవర్గం లోని అన్ని మండలాలకు గులాబీ కలర్ సింబల్ తో ప్రత్యేకంగా చేపించిన సుమారు 2000 గొడుగులను వారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఐటీ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్న కేటీఆర్ చిరకాలం ప్రజా సేవలో సేవ కొనసాగాలని అన్నారు, ప్రజలందరి ఆశీర్వాదంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు, గొప్ప నాయకుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు కేటీఆర్ అని ఆయన అన్నారు, ఆశయ సాధన కోసం తండ్రి ముఖ్యమంత్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రతిపక్ష పార్టీలకు సింహ స్వప్నంగా మారి రాజకీయాలలో అపరచానిక్యుడిగా విజయాలు కొనియాడారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ హబ్ గా మార్చి వేలాది మంది యువతకు ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలుపుతున్న యువ నాయకుడు కేటీఆర్ అన్నారు, నేడు యువత అంతా కేటీఆర్ బాటలో పరిగెడుతున్నారని ఆయన అన్నారు