ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు ఆదివాసీలు బలి కావాల్సి వస్తుంది, మణిపూర్ రాష్ట్రంలో శాంతి నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాలి : ఆదివాసీ సేన మణుగూరు మండల కమిటీ
ఏజెన్సీ న్యూస్ , మణుగూరు ప్రతినిది 24 జూలై 2023 మణిపూర్ గిరిజన మహిళలపై అమానుషంగా ప్రవర్తించి , కనీస మానవత్వాన్ని మరిచి సభ్యసమాజం తల దించుకునేలా… ప్రపంచ పటంలో భారత దేశ ఔనత్యాన్నికి నష్టం చేకూర్చేలా వ్యవహరించిన దుండగులను మరియు కనీస రక్షణ చర్యలు చేపట్టడంలో విఫలం అయిన పోలిసులను కఠినంగా శిక్షించాలని, మహిళల పైన జరిగిన ఘటన నూ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆదివాసి సేన మణుగూరు మండల కార్యదర్శి పూనెం నాగరాజు అన్నారు. ఈ ఘటనలకు కారణం కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ విధానాలే అని, ఈ ఘటనలకు భద్యత వహిస్తు తక్షణమే మణిపూర్ ముఖ్యమంత్రి బైరాన్ సింగ్, దేశ ప్రధాని నరేంద్ర మోడీ తమ పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. మణిపూర్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు తెలిసికూడా ప్రభుత్వాలు స్పందించక పోవడం గిరిజన ఆదివాసుల ప్రాణాలకు రక్షణ కల్పించక పోవటం, గిరిజనేతరులకు అనుకులంగా ప్రవర్తించడం చాలా బాధాకరమని వారు వాపోయారు. మహిళలలు, బాలికలపైన కుడా అనేక అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగిన అవి వెలుగు లోనికి రాలేదని, శాంతి , సామరస్య పూర్వకంగా ఉన్న మణిపూర్ నూ.. కొత్త కులాలనూ ఓటు బ్యాంక్ రాజకీయం కోసం కలపాలని చూస్తూ.. ఆదివాసులకు అన్యాయం చేయాలనే కుట్ర వల్లన.. ఘర్షణ వాతావరణం నెలకొందని, రాజ్యంగాన్ని ఏమాత్రం గౌరవించని పాలకులు ఉన్న లేకున్నా ఒరిగేదేమీ లేదని వారు అన్నారు. దీనికి భాద్యతగా.. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేంటనే భర్తరఫ్ చేసి, ఆక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని, రాష్ట్రపతి ఈ విషయంలో ప్రత్యేక చర్యలు తక్షణమే తీసుకోవడం తో పాటు.. మణిపూర్ ఘటనల పై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరపడానికి కమిటీని వేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గనేబోయిన ముత్తయ్య, మడి రమేష్, గనిబోయిన రాజ్ కుమార్, సాయి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.