తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావుని మర్యాదపూర్వకంగా కలిసిన… మణుగూరు మండల విశ్వబ్రాహ్మణ సంఘం
ఏజెన్సీ న్యూస్ , మణుగూరు ప్రతినిది 24 జూలై 2023, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు &భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావుని సోమవారం నాడు మణుగూరు మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి లంక మల్లారం గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం నిర్మాణం కోసం ఉన్న సమస్యను పరిష్కరించాలని వారికి వినతి పత్రం అందజేశారు సమస్యల పరిష్కారానికి తన అన్ని విధాలు అండగా ఉంటానని వారికి భరోసా కల్పించారు