మున్నూరు కాపులకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం..
ఏజెన్సీ న్యూస్ , మణుగూరు ప్రతినిది 24 జూలై 2023, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు సోమవారం నాడు బూర్గంపాడు మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వారిని మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్నూరు కాపు కులస్తులకు అండగా నిలుస్తుందని అన్నారు, బిఆర్ఎస్ పార్టీలో మున్నూరు కాపులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని గుర్తు చేశారు, గత ప్రభుత్వాలు పాలకుల హయాంలో కూడా మున్నూరు కాపుల సంక్షేమం గురించి పట్టించుకోలేదు అన్నారు నన్ను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మున్నూరు కాపులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు