మణిపూర్ రాష్ట్రంలో మహిళపై జరిగిన బాధ్యులను కఠినంగా శిక్షించాలి..
ఏజెన్సీ న్యూస్ , బూర్గంపాడు ప్రతినిది 25 జూలై 2023 , బూర్గంపాడు మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ నందు సిపిఐ సిపిఎం రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా మణిపూర్ రాష్ట్రంలో మహిళపై జరుగుతున్న అరాచకత్వానికి మరియు హత్యలకు నిరసనగా మహిళలను నగ్నంగా ఊరేగించిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ మండల కార్యదర్శి మువ్వా వెంకటేశ్వరావు సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉండి మరియు కేంద్రంలో కూడా బిజెపి అధికారంలో ఉండి శాంతి భద్రతలు లేకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ మహిళలపై మానభంగాలు అర్ధనగ్న ప్రదర్శనలు చేయడం అత్యంత బాధాకరమని మరియు బిజెపి ప్రభుత్వం సిగ్గుచేటని ఇంత జరుగుతున్నా ఏమీ తెలియనట్టుగా వ్యవహరించడం చాలా బాధాకరమని తక్షణమే నైతిక బాధిత ఉంచి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రాజీనామా చేయాలని సిపిఐ సిపిఎం పార్టీలు మణిపూర్ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు శ్రీనివాసరావు. సిపిఎం మండల కమిటీ సభ్యులు నాగేశ్వరరావు. బర్ల తిరపతిరాయ్య. కంత్రి ప్రతాప్. యాకోబ్ పాష. ఎంకమ్మ. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు