లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – తహశీల్దార్ భగవాన్ రెడ్డి..
ఏజెన్సీ న్యూస్ , బూర్గంపాడు ప్రతినిది 26 జూలై 2023 , బూర్గంపాడు మండలం లో భారీ వర్షాల, గోదావరి వరదల నేపథ్యంలో బూర్గంపహాడ్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ భగవాన్ రెడ్డి కోరారు… ఈరోజు బూర్గంపహాడ్ మండలంలో సుమారు 10 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదయిందని, సమీపంలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని, గోదావరి వరద కూడా వేగంగా పెరుగుతూ రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయికి అతి సమీపంలో ఉన్నదని ఆయన తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుండి ఎవరూ బయటకు రావద్దని వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని, గోదావరి వరదను చూసేందుకు రావద్దని ఆయన సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు, వరద ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలు అవసరమైతే పునరావస కేంద్రాలకు తరలిరావాలని సూచించారు. ఏదైనా అత్యవసరమైతే బూర్గంపహాడ్ ఫ్లాట్ కంట్రోల్ రూమ్ నంబర్ 8142779232 ని సంప్రదించాలని సూచించారు.