వరద బాధితల పునరావస కేంద్రాన్ని సందర్శించిన … తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
ఏజెన్సీ న్యూస్ , మణుగూరు ప్రతినిది 26 జూలై 2023 , మణుగూరు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన వరద బాధిత పునరవాస కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & రేగా కాంతారావు సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా బాధితులకు ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి తెలుసుకున్నారు పునరావాస కేంద్రాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు భారీ వర్షాలు కురుస్తున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే తప్ప బయటకి రావద్దని సూచించారు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితిలో వచ్చిన తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు, పార్టీ తరపున ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించడానికి ఎల్లవేళలా కృషి చేస్తున్నామన్నారు.