పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరయంగా జరగాలి | అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు
ఏజెన్సీ న్యూస్ , కొత్తగూడెం ప్రతినిది, 24 జూలై 2023, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరయంగా జరగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయపు మినీ సమావేశపు హాలులో పట్టణ ప్రగతి కార్యక్రమాలపై మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్లు, డిఈలు టౌన్ ప్లానింగ్ అధికారులు, ఏఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఈ రెండు నెలలు పారిశుధ్యం అత్యంత కీలకమని చెప్పారు. మురుగుకాలల్లో నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రం చేపించాలని చెప్పారు. మురుగు నీటి నిల్వలు పేరుకుపోయిన ప్రాంతాలను గుర్తించి నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఆరు బయట వ్యర్థాలు వేయకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజలు డ్రైడే పాటించేలా అవగాహన కల్పించాలని చెప్పారు. హరితహారంలో కేటాయించిన లక్ష్యం మేర లక్ష్యాన్ని సాదించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కొత్తగూడెం ఇల్లందు మున్సిపల్ చైర్మన్లు సీతాలక్ష్మి, వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్లు రఘు, అంకుష్ వలి, స్వామి, ఉమా మాహేశ్వరరావు, డిఈ లు, ఏ ఈలు, టిపివోలు తదితరులు పాల్గొన్నారు.