ప్రజావాణి కార్యక్రమంలో మొదటి పిటిషన్ దివ్యాన్గుల వద్దకు వెళ్లి తీసుకున్న జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అల
ఏజెన్సీ న్యూస్ , కొత్తగూడెం ప్రతినిది 24 జూలై 2023, జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ ప్రియాంక అల సోమవారం ఐడిఓసిలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ ప్రజావాణిలో మొదటి పిటిషన్ దివ్యాంగుల నుండి తీసుకున్నారు. దివ్యాంగుల వద్దకే స్వయంగా వెళ్లి కలెక్టర్ దరఖాస్తు తీసుకున్నారు. సమస్య పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. దివ్యాంగుల పట్ల తనకున్న కన్సర్న్ దీనితో కలెక్టర్ చాటుకున్నట్లయింది. ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు అందరు హాజరయ్యారు. ప్రజావాణికి పెద్ద ఎత్తున ప్రజలు తమ ఫిర్యాదులతో తరలి వచ్చారు. కలెక్టర్ వెంట వెంటనే స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి తగిన ఆదేశాలు జారీ చేస్తూ సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు మధుసూధన రాజు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణికి పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు.