కొవ్వొత్తుల ర్యాలీ తో మణిపూర్ బాధిత మహిళలకు సంగీభావం తెలియజేసిన ఆదివాసీ గిరిజన బిడ్డలు. తక్షణమే నేరస్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆదివాసీ ప్రజలు..
ఏజెన్సీ న్యూస్ , కరకగూడెం ప్రతినిది 25 జూలై 2023 , కరకగూడెం మండలం మణిపూర్ సంఘటనలో ఆదివాసీ మహిళలను అత్యాచారం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ దుండగుల దిష్టిబొమ్మలను దహనం చేయడం జరిగింది. మణిపూర్ లో ఇద్దరు ఆదివాసీ మహిళలను నగ్నంగా ఊరేగించి కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడడం ఇది అవమానవియ సంఘటన అని అన్నారు.ఇటువంటి సంఘటన సభ్య సమాజానికి సిగ్గు చేటన్నారు. ఈ సంఘటనపై దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దుండగులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం ఆదివాసీ ప్రజలు.