వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన కరకగూడెం మండల కాంగ్రెస్ నాయకులు..
ఏజెన్సీ న్యూస్ , కరకగూడెం ప్రతినిది 26 జూలై 2023 , కరకగూడెం మండలం పలు గ్రామపంచాయతీలలోని వరద ముంపు ప్రాంతాలను, బ్రిడ్జిలను, రోడ్లను, పాత ఇండ్లను, కూలిపోయిన గుడిసెలను, కోళ్ల ఫామ్ లను పరిశీలించిన కరకగూడెం మండల కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ, భారీ వర్షాలు ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అలాగే నది తీర గ్రామాలలో ఉన్న ప్రజలను, వరదలు వచ్చిన ఆయా ప్రాంతాల ప్రజలను వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి వారిని పునరావస కేంద్రాలకు తరలించాలన్నారు.. వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో రోడ్లు గ్రామాలు జలమయమయ్యే ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎటువంటి ఆటంకాలు కలగకుండా తక్షణమే పర్యవేక్షించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు అందించాలని, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉంటుందని కాబట్టి రోడ్డు రవాణా,విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా విద్యుత్,రెవెన్యూ,ఆర్ & బి శాఖ అధికారులు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు గారు, మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్ గారు తదితరులు పాల్గొన్నారు.