ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేసే అధిక లాభాలు పొందవచ్చు… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
ఏజెన్సీ న్యూస్ , కరకగూడెం ప్రతినిది 26 జూలై 2023 , కరకగూడెం మండలం లోని సమత్ భట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కుర్నవల్లి గ్రామంలోని తన స్వగ్రామంలో తన పొలంలో సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ తోటను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు వ్యవసాయ శాఖ అధికారులు హార్టికల్చర్ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పుష్కలంగా సాగు నీరు, ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు భీమా, పలు రైతుసంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆయిల్ పామ్ సాగు కు తెలంగాణ ప్రభుత్వ రాయితీలు – ప్రోతహం: మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలి – వరి కి ప్రత్యామ్నాయంగా ఆయిల్ సాగు చేయాలి. ఆయిల్ పంప్ పంట సాగు చేయడం వలన ఎకరానికి లక్ష రూపాయలు ఆదాయం పొందవచ్చు- తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పంట సాగు కు మొక్కలు, యాజమాన్యం ,బిందు సేద్య పరికరాలు పై ఒక ఎకరానికి 50 వేల వరకు రాయితీ అందిస్తుంది. మార్కెట్లో వంటనూనెల వినియోగం ఎక్కువగా ఉంది. వంట నూనెలను విదేశాల నుండి లక్ష కోట్ల రూపాయల పైగా ఖర్చు చేసి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. కనుక వంట నూనెలలో స్వయం సమృద్ధి సాధించుటకు డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్ పంట సాగు చేయాలి. స్వయంగా 11 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ మొక్కలు నాటడం జరిగింది అన్నారు, మొదటి మూడు సంవత్సరాలు అంతర పంటలుగా అన్ని రకాల కూరగాయలు, అపరాలు, నూనె గింజలు, ఇతర పంటలు సాగు చేసుకోవచ్చని తద్ద్వరా అదనపు ఆదాయం వస్తుంది అని తెలిపినారు.మొక్కలు నాటి వెనువెంటనే ఆధార్ తో లింక్ అయినా రన్నింగ్ బ్యాంక్ ఖాతాకు ఎకరాకు రూ. 4200/-రూపాయలు నాలుగు సంవత్సరాల వరకు జమ చేయబడును. కనుక జిల్లా రైతాంగం ఆయిల్ ఫామ్ సాగవైపు మొగ్గుచూపి ప్రభుత్వం ఇచ్చిన రాయితీలను ఉపయోగించుకోవాలని కోరినారు. ఈ కార్యక్రమంలో మణుగూరు వ్యవసాయ సహాయ సంచాలకులు తాతారావు , ఆయిల్ ఫెడ్ డివిజనల్ అధికారి శ్రీ ఆకుల బాలకృష్ణ , జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి, జినుగు. మరియన్న, ఉద్యాన అధికారి ఆర్. శాంతి ప్రియ, ఆయిల్ ఫెడ్ అధికార్లు శ్రీ.D. అప్పారావు, శ్రీ.పి.రాజేశ్ రెడ్డి, రైతులు శ్రీ రావుల కనకయ్య, ఎలిపిరెడ్డి శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు. AEO లు అనిల్, ప్రశాంత్ లు పాల్గొన్నారు.