లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం భద్రాచలం, ఏ.ఎస్పీ ఏజెన్సీ న్యూస్ , భద్రాచలం ప్రతినిది 26 జూలై 2023, భద్రాచలం డివిజన్ పరిసర ప్రాంతాలలో వర్షాల కారణంగా, గోదావరి నది కి వరద వచ్చే అవకాశం ఉన్నందున, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని తెలియజేయుచున్నము. వొక వేళ గోదావరికి వరద పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజలు పోలీసు సిబ్బంది కి సహకరించి దగ్గరలోని పునరావాస కేంద్రాలకు వెళ్లవలసిందిగా కోరుచున్నము. గోదావరికి వరద క్రమేపీ పెరుగుచున్నందున ప్రజలు సందర్శనార్దం కరకట్ట వైపు వెళ్ళటం ప్రమాదకరం, కావున భద్రాచలం లో కరకట్ట, రెడ్డి సత్రం వైపు ప్రజలు వేళ్ళ వద్దని కోరుచున్నాము. రాబోయే 24 గంటలలో భద్రాచలం డివిజన్ పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున, జాలరులు, చేపల వేట చేసే వారు గోదావరి లో మరియు నిండు గా ప్రవహిస్తున్న వాగులలో, కుంటలు, చెరువులలోకి చేపల వేటకు వెళ్లవద్దని కోరుచున్నాము. లో లెవల్ చప్టా ల వద్ద వరద ఉదృతి ఎక్కువగా ఉంటే దాటుటకు ప్రయత్నం చేయవద్దని కోరుచున్నము. ఏదైనా సహాయం కావాలంటే డయల్- 100 కు ఫోన్ చేయగలరని, పోలీసు శాఖ ఎల్లప్పుడు మీకు అందుబాటులో ఉంటుందని తెలియ పరుచుకుంటున్నాము.