భద్రాచలం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద నిషేధిత గంజాయి పట్టివేత
ఏజెన్సీ న్యూస్ , భద్రాచలం ప్రతినిది 24 జూలై 2023, భద్రాచలం ఏఎస్పి పారితోష్ పంకజ్ ఉత్తర్వుల మేరకు, సోమవారం భద్రాచలం పట్టణ ఎస్ ఐ ఎస్. మధుప్రసాద్ తన పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటుగా భద్రాచలం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా, భద్రాచలం రోడ్ వైపు నుండి సారపాక వైపుగా వస్తున్న మహీంద్రా బొలెరో ఏపీ 11 డబ్ల్యూ 7863 వాహనంలో హైదరాబాద్ కు చెందిన డ్రైవరు మహమ్మద్ జాఫర్ ఖాన్ మరియు బీదర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రంనకు చెందిన మహమ్మద్ అజాజ్ అహ్మద్, ఫిరోజ్ ఖాన్ ఇద్దరు వ్యక్తలు వస్తుండగా అట్టి వాహనంను ఆపి చెక్ చేయగా, సీక్రెట్ ఛాంబర్ లో ప్రభుత్వ నిషేదిత గంజాయి 140 ప్యాకెట్లు ఒక్కొకటి 2 కిలోల చొప్పున మొత్తం 280 కిలోలు కలవు. కర్ణాటక, బీదర్ కు చెందిన గంజాయి వ్యాపారులు అయిన ఎస్.కె నదీం మరియు రమేష్ ల యొక్క ప్రోద్బలంతో, హైదరాబాదుకు చెందిన ఎండి. జహంగీర్ కురేషి మరియు ఎండి. మాసి ఉద్దిన్ ల యొక్క మహీంద్రా బొలెరో వాహనంను వేసుకొని కలిమెల వద్దకు వెళ్లి గంజాయి వ్యాపారి అయిన గుండు అను వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి, భద్రాచలం మీదుగా హైదరాబాద్ కు వెళుతున్న క్రమంలో భద్రాచలం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద పట్టుబడినారు. గంజాయి విలువ 56 లక్షలు ఉంటుంది. వారి వద్ద నుండి 3 మొబైల్ ఫోనులు సీజ్ చేశారు. భద్రాచలం టౌన్ సిఐ నాగరాజు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించడం జరిగింది.