వర్షాలు, వరదలు తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రభుత్వ సిబ్బంది పని చేసే కార్యస్థానాల్లోనే అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఆదేశించారు.
ఏజెన్సీ న్యూస్ , కొత్తగూడెం ప్రతినిది 26 జూలై 2023 , రానున్న రెండు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే పరిస్థితులు, గోదావరి వరద పరిస్థితిపై భద్రాచలం ఆర్డిఓ కార్యాలయం నుండి రాత్రి రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, రహదారులు భవనాలు, మిషన్ భగీరథ, విద్యుత్, వైద్య, సెక్టోరియల్, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచన మేరకు మన జిల్లా ఆరెంజ్ జోన్ లో ఉన్నట్లు చెప్పారు. తహశీల్దార్లు, ఎంపిడీఓలు హై అలెర్ట్ గా ఉండాలని చెప్పారు. ఏర్పాటు చేసిన టీములు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పారు. ప్రత్యేక అధికారులు సెక్టోరియల్ అధికారులు కేటాయించిన మండలాల్లో వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పారు. మండలాల్లో సమస్యాత్మక ప్రాంతాలున్నాయో సమగ్ర జాబితా ఉండాలని చెప్పారు. చెరువులు పరి రక్షణ చర్యలు చేపట్టాలని ఇసుక బస్తాలు అందుబాటులో ఉంచాలన్నారు. రోడ్లపైకి నీరు చేరిన ప్రాంతాల్లో రాకపోకలు పటిష్ట నియంత్రణ చేయాలని చెప్పారు. మండలాల్లో ముంపుకు గురయ్యే గ్రామలున్నాయి, నీట మునిగే రోడ్లున్నాయి, చెరువుల యొక్క స్థితిపై సమగ్ర సమాచారం ఉండాలని చెప్పారు. గ్రామ స్థాయి నుండి శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. ములకలపల్లిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని అలాంటి నీట మునిగే ప్రాంతాల్లో ప్రయాణాలు చేయకుండా ట్రాక్టర్లు అడ్డుగా పెట్టాలని చెప్పారు. మండల స్థాయి టీములు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎక్కడా విద్యుత్ సమస్య రావొద్దని, ఫిర్యాదులు వస్తే తక్షణమే పరిష్కరించాలని చెప్పారు. మంచినీటి సమస్య రావొద్దని, సరఫరా ఆగిపోయిన గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని చెప్పారు. మంచినీటి సమస్య వచ్చిన ప్రాంతాల్లో పంచాయతి, రెవెన్యూ అధికారులు మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని చెప్పారు. మంచినీటి పరీక్షలు చేయాలన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు పనులకు వెళ్ళ కుండా పటిష్ట నియంత్రణ చేయాలని చెప్పారు. రెండు రోజులు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని చెప్పారు. నీళ్లు నిలిచే ప్రాంతాల్లో రవాణా సేవలు నిలిపి వేసేందుకు పోలిస్, అగ్నిమాపక సిబ్బంది సేవలు వినియోగించుకోవాలని చెప్పారు. రానున్న రెండు రోజులు అత్యంత కీలకమని ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, మధుసూదన్ రాజు, ఆర్ అండ్ బి ఈ ఈ భీంలా, జిల్లా వైద్యాధికారి డా శిరీష, డా రవి బాబు, ఉద్యాన అధికారి జినుగు మరియన్న, ఇరిగేషన్ సి ఈ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.