అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దు -అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి -ఎమర్జెన్సీ ఉంటే కంట్రోల్ రూములకు ఫోన్ చేయాలి
గోదావరి వరద నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తున్న… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
ఏజెన్సీ న్యూస్, బూర్గంపాడు ప్రతినిధి – జులై 20. 2023 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేని ప్రోలు రెడ్డి పాలెం గోమ్మూరు వద్ద కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో వస్తున్న వరదలపై గోదావరి నీటి ప్రవాహాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు తో కలిసి పరిశీలించడం జరిగింది, అధికారులు ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సమన్వయంతో పనిచేయాలని సూచించారు లోతట్టు ప్రాంతాల వారిని గుర్తించాలని పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చూశారు గోదావరి పరివాహక ప్రాంతాలలో వరద ఏమాత్రం పెరిగిన ముందుగా లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు…