Spread the love

ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్

ఏజెన్సీ న్యూస్, కొత్తగూడెం  ప్రతినిధి – జులై 20. 2023 గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతూ ప్రమాదస్తాయికి చేరుకుంటుంది.కావున గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు.ప్రజలు ఎవరూ భయబ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని,అన్ని శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ జిల్లా పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేసారు.గోదావరి నది ఉదృతిని గమనిస్తూ ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే డయల్ 100కు కాల్ చేసి పోలీసు వారి సహాయం తీసుకోవాలని సూచించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *