పోటీ కార్మికులకు రోజుకు 1000 రూపాయలు అసలు కార్మికులకు రోజుకి 300 అన్యాయం కాదా?| CITU
ఏజెన్సీ న్యూస్, బుర్గంపహాడ్ ప్రతినిది,22 జూలై 2023 పంచాయతీ కార్మికుల సమ్మెను విచ్చిన్నం చేయటం కోసం అధికారులు పోటీకి పెట్టిన కార్మికులకు ప్రభుత్వం రోజుకి 1000 రూపాయలు ఇచ్చి భోజనం ఏర్పాటు చేస్తున్నారని దశాబ్దాల తరబడి పనిచేస్తున్న పంచాయతీ కార్మికులకు మాత్రం కేవలం రోజుకి 300 రూపాయలు చెల్లిస్తున్నారని ఇది అన్యాయం కాదా అని సిఐటియు జిల్లా అధ్యక్షులు కె బ్రహ్మచారి ప్రభుత్వాన్ని పంచాయతీ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయటం కోసం రాష్ట్ర మంత్రులు మొదలుకొని పంచాయతీ కార్యదర్శులు వరకు మూకమ్మడిగా సమ్మె చేస్తున్న కార్మికులపై అబద్దాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు పోటీ కార్మికులను బట్టి ప్రభుత్వ అధికారులు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని కోటి కార్మికుల కోసం వెచ్చించే డబ్బును కార్మికుల జీతాలు పెంచడం కోసం ఖర్చు చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది పోటీ కార్మికులకు రోజుకి 1000 రూపాయలు చొప్పున నెలకు 30000 ఇవ్వటానికి సిద్ధపడుతున్న అధికారులు దశాబ్దాల తరబడి పనిచేస్తున్న కార్మికులు నెలకు 19000 ఇవ్వమని కోరుతుంటే ఎందుకు స్పందించడం లేదని సిఐటియు ప్రశ్నించింది పంచాయతీ కార్మికుల సమ్మె పట్ల కలెక్టర్ పేరుతోటి సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని సిఐటియు తీవ్రంగా ఖండించింది పంచాయతీ కార్మికుల సమ్మె వాళ్లని భద్రాచలంలో గోదావరి వరదలు వచ్చాయని కలెక్టర్ మాట్లాడినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై జిల్లా కలెక్టర్ ఎవరన్నా ఇవ్వాలని సిఐటియు డిమాండ్ చేసింది జిల్లా కలెక్టర్ గారి నిజంగా అటువంటి మాటలు మాట్లాడి ఉంటే అది సరైన పద్ధతి కాదని సమ్మె జూలై 6న ప్రారంభమైందని గోదావరి వరదలు నాలుగు రోజుల క్రితం వచ్చాయని మరి జూలై ఆరు నుండి సమ్మెను పరిష్కారం చేయకుండా ప్రభుత్వం ఎందుకు దున్నపోతు మీద వాన పడినట్టు వ్యవహరిస్తుందని సిఐటియు ప్రశ్నించింది సమ్మెలో ఉన్న కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయడానికి ప్రభుత్వం మీనమేషాలు లెక్కబెడుతుందని విమర్శించారు ప్రభుత్వానికి జీతాలు పెంచడం చేతకానప్పుడు మార్కెట్లో నిత్యవసర సరుకుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు 2 200 కేజీ కందిపప్పును 20 రూపాయలకు ఇవ్వాలని 1200 ఉన్న గ్యాస్ సిలిండర్ ను 300 కి ఇవ్వాలని అన్ని రకాల సరుకుల ధరలను రూపు పది రూపాయల నుంచి 20 రూపాయల లోపు రేట్లకే కార్మికులకు ఇస్తారా అని సిఐటియు ప్రశ్నించింది నిత్యవసర సరుకుల ధరలు మాత్రం ఆకాశాన్ని అంటే లాగా పెంచుతున్న ప్రభుత్వాలు కార్మికుల వేతనాలు మాత్రం పెంచడం లేదని విమర్శించారు సమ్మె డిమాండ్లు పరిష్కారం చేయకుండా విచ్ఛిన్నం చేయాలని కుట్రలు చేస్తున్నారని సిఐటియు విమర్శించింది సమ్మె విచ్ఛిన్నం పైన పెట్టే శ్రద్ధ జేఏసీతో చర్చలు జరిపి డిమాండ్ల పరిష్కారం పైన దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సీఐటీయూ విజ్ఞప్తి చేసింది జిల్లాలో డిపిఓ పనిగట్టుకుని సమ్మె విచ్ఛిన్నానికి ప్రయత్నం చేస్తున్నారని దీని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు సారపాక పంచాయతీలో సమ్మె ఇచ్చిందానికి డిపిఓ డైరెక్షన్లో పంచాయతీ అధికారులు చేసిన చర్యలను సిఐటియు నాయకత్వంలో కార్మికులు తిప్పికొట్టారు తామంతా జేఏసీ నిర్ణయం మేరకు పూర్తిస్థాయిలో సమ్మెలో ఉంటామని సమ్మె శిబిరంలో కార్మికులందరూ ప్రతిజ్ఞ చేశారు ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా సమ్మెను విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో సిఐటియు బూర్గంపాడు మండల కన్వీనర్ బర్ల తిరుపతయ్య తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు బూర్గంపాడు మండల నాయకులు యాకూబ్ నాయకులు చారి సురేష్ యాకూబ్ వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు