మండలంలో లోతట్టు ప్రాంతాల్లో విసృతంగా పర్యటించి, మత్స్యకారులు పోలీసులకు సహాకరించాలి,DSP వెంకటేష్.
ఏజెన్సీ న్యూస్, బూర్గంపహాడ్ ప్రతినిది,23 జూలై 2023 , భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదు,ఆరు రోజులుగా దంచి కొడుతున్న వర్షాలు,ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లాలో కుడా అదే తరుణంగా భారీగా కురుస్తున్న వర్షాల వరదలతో,గోదావరి లో కలుస్తున్న వందల పిల్ల కాలువలు,పదుల సంఖ్యలో వాగులు,వంకలు ఈ క్రమంలో మత్స్యకారులు చేపల వేట చేస్తున్నారు.ఈ క్రమంలో బూర్గంపహడ్ మండలంలోనీ మత్స్యకారులకు DSP వెంకటేష్ నేడు పలు సలహాలు సూచనలు చేశారు.చేపల వేట నిషేధించడం జరిగింది అని దీనికి మత్స్యకారులు అందరూ సహకరించాలి అని వారికి పలు సలహాలు సూచనలు చేశారు.గోదావరి,వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి అని చేపల వేటకు ఎవరు వెళ్ళవద్దు అని,చేపలకు వెళ్లి కాస్తో,కూస్తో మధ్యం సేవించి తెప్పలు,పడవలు,నావలు నడిపేటప్పుడు ప్రమాధవశాత్తు వరద తగిలితే ఎంత పెద్ద గజ ఈతగాడు అయిన ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది అని వేటకు వెళ్లిన మీకోసం ఇంట్లో తల్లి,దండ్రులు అదే విధంగా పెళ్ళాం,పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు అని ఎదురు చూసే ఆ కళ్ళకు ఘోష తెప్పించవద్దు అని ఆయన వారికి క్లుప్తంగా వివరించారు ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కుడా చేపల వేట నిషేదించినట్టు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి CI వినయ్ కుమార్ మాట్లాడుతూ జాలర్లు,మత్స్యకారులు చేపల వేటనీ నిషేధించడం జరిగింది అని పోలీస్ కి ప్రతి ఒక్కరూ సహకరించాలి అని వరదల అనంతరం ప్రతి ఒక్కరు చేపల వేటకు వెళ్లే ముందు స్థానిక SI గారికి సమాచారం ఇవ్వలని అయన అన్నారు.ఈ కార్యక్రమంలో మత్స్యకారుల ప్రసిడెంట్ గుండె నర్సింహ రావు,ఉపాధ్యక్షుడు ఏర్రయ్య,అనుబంధ సభ్యుడు గుండె వెంకన్న వారి మత్స్యకార బృందం 60 మంది పాల్గొన్నారు. బూర్గంపహడ్ సర్పంచ్ సిరిపురం స్వప్న కి DSP సూచన. బూర్గంపహడ్ మండల కేంద్ర సమీపంలోని ఆంధ్ర,తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న కిన్నెరసాని బ్రిడ్జి వద్ద గోదావరి,కిన్నేరసాని కలిసే ప్రదేశాన్ని సన్నంగా పరిసిల్చిన DSP అక్కడ ఉన్న స్థానక బూర్గంపహడ్ సర్పంచ్ సిరిపురం స్వప్న కి DSP పలు సూచనలు చేశారు చేపల వేటకు ఎవరిని వెళ్లనివద్దు అని,గోదావరి నీ వీక్షించేందుకు వచ్చే ప్రజలను ఎవరిని గోదావరి,కిన్నెరసాని ప్రాంతాలకు రానివద్దు అని ప్రజలకు అందుబాటులో ఉండి అందరికీ సహకరించి గ్రామంలో వ్యర్ధాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలి అని తెలిపారు.సర్పంచ్ తో పాటు ఈఓ సమ్మయ్య,వార్డు మెంబర్ ధర్మయ్య గ్రామ ప్రజలు ఉన్నారు.అనంతరం మండలంలో లోతట్టు ప్రాంతాలు అయిన బూర్గంపహడ్ మరియు ఆంధ్ర,తెలంగాణ సరిహద్దులో గల బ్రిడ్జి అదే విధంగా నాగినేనీ ప్రొలు రెడ్డిపాలేం లోని గొమ్మురు ఇసుక ర్యాంప్ వద్ద గోదావరి ప్రాంతం,సారపాక,ఇరవెండి,మోతే ప్రాంతాల్లో విసృతంగా పర్యటించి అక్కడి ప్రజలకు మరియు వారి సిబ్బందికి తగు,సలహాలు సూచనలు చేసిన పాల్వంచ DSP వెంకటేష్.వారితో పాటు పాల్వంచ Ci వినయ్ కుమార్,స్థానిక SI సంతోష్ కుమార్ వారి పోలీస్ బృందం ఉన్నారు.