గోదావరి ఉధృతిని పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు , ఎంపీ మాలోత్ కవిత…
ఏజెన్సీ న్యూస్ , భద్రాచలం ప్రతినిది 22 జూలై 2023 , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద బ్రిడ్జి పై నుంచి గోదావరి వరద ఉధృతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు , మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ & బిఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాలోత్ కవిత పరిశీలించడం జరిగింది , ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముంపు కాలనీ వాసులను కేంద్రాలకు తరలించి వారికి విద్యుత్, మంచి నీరు మంచి ఆహారం అందించాలని ఆదేశించారు, గోదావరి వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని ఎలాంటి పరిస్థితులను అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.