భద్రాచలంలోని గోదావరి వరద క్రమంగా పెరుగుతున్నందున లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా….
ఏజెన్సీ న్యూస్ , భద్రాచలం 20 జూలై 23.భద్రాచలంలోని గోదావరి వరద క్రమంగా పెరుగుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అన్నారు.గురువారం నాడు భద్రాచలంలోని వరద ముంపు ప్రాంతమైన కొత్త కాలనీని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ తో కలిసి పరిశీలించారు. వరద నీటిలో మునిగిపోయిన పది కుటుంబాల వారిని భద్రాచలంలోని పునరావాస కేంద్రానికి తరలించి గోదావరి వరద పెరిగే సూచన ఉన్నందున మిగతా కుటుంబాల వారు కూడా పునరావాస కేంద్రానికి వెళ్లాలని ప్రజలకు సూచించిన అనంతరం ఆమె మాట్లాడుతూ గురువారం నాడు మూడు గంటల 20 నిమిషాలకు గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి గోదావరి పెరుగుతున్నందున వరద ముంపునకు గురి అయ్యే గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రానికి తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని ప్రస్తుతానికి గోదావరి వరద క్రమంగా పెరుగుతుందని అర్ధరాత్రికి 46 అడుగులు వరకు పెరగవచ్చని దానికి తగినట్లు ముంపు ప్రాంత ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండ అన్ని ఏర్పాట్లు చేశామని రెండో ప్రమాద హెచ్చరిక వరకు గోదావరి పెరిగిన అధికారులను సిబ్బందిని ఆయా ప్రదేశాలలో సిద్ధంగా ఉంచామని అన్నారు. ఇంకా కొత్త కాలనీలోని 21 కుటుంబాలను రేపటి వరకు పునరావాస కేంద్రాలకు తరలిస్తామని అన్నారు. అనంతరం విశాఖ కాంప్లెక్స్ లోని పంపు హౌస్ ను మరియు గుడిమెట్ల దగ్గర ప్రదేశాలను పరిశీలించి నీరు నిలవ లేకుండా చూడాలని వరద నీటిలో కొట్టుకు వచ్చిన చెత్తాచెదారం ఎప్పటికప్పుడు తొలగించాలని భద్రాచలం స్పెషల్ ఆఫీసర్ నాగలక్ష్మి గ్రామపంచాయతీ ఈవోకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆర్డీవో రత్న కళ్యాణి తాసిల్దార్ రామకృష్ణ ఇరిగేషన్ ఎస్సీ వెంకటేశ్వర్లు ఏ ఈ ఈ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.